- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోరిక తీర్చాలని పిన్నిపై లైంగిక వేధింపులు
లైంగిక కోరిక తీర్చలేదని వరుసకు పిన్ని అయ్యే ఓ మహిళ పై ఓ యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, ధర్మసాగర్ : హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. వరుసకు పిన్ని అయిన ఓ మహిళ ను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ యువకుడు. వేధింపులతో పాటు హత్యాయత్నం కూడా చేశారు. ఎస్సై సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ధరావత్ రాజ్ కుమార్(30) అదే గ్రామానికి చెందిన వరుసకు పిన్ని అయ్యే మహిళ పై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. తన కోరిక తీర్చాలని తరుచూ ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో బాధితురాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆగ్రహానికి గురైన రాజ్ కుమార్ హత్యయత్నం చేశాడు.
ఈనెల 24న రాత్రి సమయంలో బాధితురాలు కిరాణ షాపులో కూర్చొని ఉండగా.. రాజ్ కుమార్ ముందే సిద్ధం చేసుకొని తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఆమె పై దాడి చేశాడు. ఆమె గట్టిగా అరవడంతో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో నిందితుడు పరారయ్యాడు. ఈ దాడిలో బాధితురాలు తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్ ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గురువారం అరెస్ట్ చేసినట్టు ఎస్సై సురేష్ వెల్లడించారు. మహిళపై లైంగిక వేధింపులు, హత్యాయత్నానికి పాల్పడిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






