- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతివేగం కారణంగా అశోక్ లేలాండ్ వాహనం బోల్తా
మేడారంలోని సమ్మక్క- సారాలమ్మలను దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తుల వాహనం బుధవారం బోల్తా పడింది.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : మేడారంలోని సమ్మక్క- సారాలమ్మలను దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తుల వాహనం బుధవారం బోల్తా పడింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల గ్రామానికి చెందిన 30 మంది భక్తులు మేడారం వెళ్తున్న క్రమంలో కామరాం గ్రామాన్ని దాటిన అనంతరం గిన్నెలవాగు బ్రిడ్జి మూల మలుపు వద్ద వాహనం అతి వేగంగా వెళ్లడం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. పదిమందికి తీవ్ర గాయాలు కాగా సమాచారం తెలుసుకున్న వెంటనే తాడ్వాయి ఎస్.ఐ. జగదీశ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని అంబులెన్స్ లో సమీప దవాఖానకు తరలించి తక్షణ చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులు మూల మలుపులు, వాగు బ్రిడ్జిల వద్ద వాహనాలను అతి వేగంగా నడపకుండా జాగ్రత్తలు పాటించాలని, మూల మలుపుల వద్ద ఉన్న సూచనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఎస్ఐ తెలిపారు.






