భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల వేగవంతంగా పరిష్కరించాలి

by velandi.Saikiran |

భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.

భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల వేగవంతంగా పరిష్కరించాలి
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, సాదా బైనామా, రీ-సర్వే ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలని, రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశానికి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ సి.హెచ్ మహేందర్ జి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న భూధార్ సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి భూ యజమానికి ఖచ్చితమైన భూ వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయడానికి సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విజయభాస్కర్, సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Next Story