- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ఆసరా పెన్షన్ల కోసం గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలి : బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న
కొత్త ఆసరా పెన్షన్ల కోసం గ్రామపంచాయతీ కార్యాలయంలో లేదా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న సూచించారు.

దిశ, ఏటూరు నాగారం : కొత్త ఆసరా పెన్షన్ల కోసం గ్రామపంచాయతీ కార్యాలయంలో లేదా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న సూచించారు. ఆదివారం ఆయన దిశతో మాట్లాడుతూ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, మంత్రి వర్గం కలిసి ఆసరా ఫించన్లను ప్రారంభించనున్నారు. ఏటూరు నాగారం ప్రజలందరూ గతంలో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారు తమకు సంబంధించిన గ్రామపంచాయతీలో ఆసరా పెన్షన్ల కు పంచాయతీ కార్యదర్శి వద్ద దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆసరా పెన్షన్ లో వృద్యాప్య, |వితంతు మహిళా, వికలాంగులు (దివ్యాంగులు ) ఒంటరి మహిళలు, దీర్ఘ్కాలిక వ్యాధులు గల లబ్ధిదారులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించు కోగలరని కోరారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు నాయకులు ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకొని పెన్షన్ల విషయంలో ప్రజలకు సహకరించాలని కోరారు.






