అంబేద్క‌ర్ విగ్ర‌హం ధ్వంసం.. పునః ప్ర‌తిష్టాప‌న

by Ratna Kumari |

మండ‌ల ప‌రిధిలోని సింగారం గ్రామంలో సోమవారం రాత్రి గుర్తు తెలియ‌ని దుండ‌గులు రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్. అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు.

అంబేద్క‌ర్ విగ్ర‌హం ధ్వంసం.. పునః ప్ర‌తిష్టాప‌న
X

దిశ‌, బ‌య్యారం : మండ‌ల ప‌రిధిలోని సింగారం గ్రామంలో సోమవారం రాత్రి గుర్తు తెలియ‌ని దుండ‌గులు రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్.అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు వంట‌నే గ్రామానికి చేరుకొని ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా సీఐ ర‌వీంద‌ర్, ఎస్సై ప్ర‌శాంత్ బాబు గ్రామ‌స్తుల‌తో మాట్లాడి ధ్వంస‌మైన విగ్ర‌హం స్థానంలో నూత‌నంగా మంగ‌ళ‌వారం అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని పున‌ప్ర‌తిష్టించి డీఎస్పీ తిరుప‌తి రావు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ప్ర‌శాంతంగా గ్రామంలో ఎవ‌రో కావాల‌ని అంబేద్క‌ర్ విగ్ర‌హం ధ్వంసం చేసి రాజ‌కీయ‌య ల‌బ్ధిపొందాల‌ని చూశార‌ని, కేసులో ఎంత‌టి వారైనా వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగించి జ‌రిగిన అవ‌మానానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఎస్పీ శ‌బ‌రీష ఆదేశాల మేర‌కు గ్రామంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లకు తావు లేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబ‌స్తు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో పోలీస్ సిబ్బంది మోహ‌న్, సుబ్బు, కోటేష్, స‌తీష్, విజ‌య్, మ‌హేంద‌ర్, శ్రీను పాల్గొన్నారు.

Next Story