- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ & పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్..
దిశ, కేయూక్యాంపస్ : డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు. ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, హనుమకొండ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వరంగల్ రీజినల్ సెంటర్, కో-ఆర్డినేటర్ డా. ఏ. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, హనుమకొండ లోని స్టడీ సెంటర్ లో మాత్రమే వివిధ పీజీ కోర్సులు, ఆర్ట్స్, సైన్స్ సబ్జక్ట్స్ లు, వివిధ సర్టిఫికెట్ కోర్స్ లు అందుబాటులో వున్నవని తెలిపారు. డిగ్రీ కోర్సు లు కాకతీయ (కేడిసి) డిగ్రీ కళాశాల హనుమకొండ , సీకేఎమ్ డిగ్రీ కళాశాల వరంగల్ లతో పాటు ములుగు, పరకాల, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, భూపాలపల్లి, ఏటూరు నాగారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్ట్స్ మరియు సైన్స్ కోర్సులు అందుబాటులో వున్నవని తెలిపారు.
ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను www.braouonline.in లో పొందుపర్చినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియెట్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు, పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులలో పాసైన విద్యార్థులు నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చని సూచించారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో చదవవచ్చునని తెలుపుతూ పాత వరంగల్ జిల్లాలోని ఇంటర్ తత్సమాన అర్హత కలిగిన వారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పి.జి ద్వితీయ, డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు కోర్సు ఫీజు కూడా జూలై 31 లోగా చెల్లించుకోవచ్చునని తెలిపారు.