- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఎంసీలో ఆర్థిక అక్రమాల ఆరోపణలు.. కార్యదర్శి సస్పెండ్
వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో ఆర్థిక అక్రమాల ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో జనగామ, పర్కాల ఏఎంసీ కార్యదర్శి గ్రేడ్–II జీ. జీవన్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ కె. సురేంద్ర మోహన్, ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు.

దిశ, జనగామ : వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో ఆర్థిక అక్రమాల ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో జనగామ, పర్కాల ఏఎంసీ కార్యదర్శి గ్రేడ్–II జీ. జీవన్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ కె. సురేంద్ర మోహన్, ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు. అధికారిక సమాచారం మేరకు, ఏఎంసీ నిధుల తాత్కాలిక దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జీవన్ కుమార్ పర్కాల ఏఎంసీ కార్యదర్శిగా పని చేస్తూనే జనగామ ఏఎంసీకి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు. సస్పెన్షన్ నేపథ్యంలో జనగామ ఏఎంసీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ బాధ్యతలను జిల్లా మార్కెటింగ్ అధికారికి పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించారు. అదేవిధంగా పర్కాల ఏఎంసీ కార్యదర్శి గ్రేడ్–II బాధ్యతలను సూపర్వైజర్ పి. వేణు గోపాల్‌కు కేటాయించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.






