పోక్సో కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు శిక్ష

by Nallavelli.Anjaneyulu |

పోక్సో కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన‌ట్టు ఎస్సై బి. సాయికుమార్ తెలిపారు.

పోక్సో కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు శిక్ష
X

దిశ, గార్ల : పోక్సో కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన‌ట్టు ఎస్సై బి. సాయికుమార్ తెలిపారు. గార్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో 2022లో పోక్సో కేసు న‌మోదు అయింది. ఆ నిందితునికి ఇవాళ పోక్సో ప్ర‌త్యేక కోర్టు న్యాయ‌మూర్తి ఎం.డీ. అబ్దుల్ ర‌ఫీ నిందితునికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. 2022లో బాధితురాలు త‌ల్లి ఫిర్యాదు మేర‌కు పోలీస్ స్టేష‌న్ లో ఐపీసీ సెక్షన్లు 363, 354(ఏ), 506 పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. ఈ కేసులో నిందితుడైన ముల్లంపల్లి సుమంత్ అనే యువకుడి ని కోర్టు దోషిగా నిర్ధారించి తీర్పు వెలువరించినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య వాదనలు వినిపించగా కోర్టు లైజనింగ్ అధికారిగా జీనత్ (ఎస్.ఐ డీ.సీ.ఆర్.బి), దర్యాప్తు అధికారిగా బి. వెంకన్న (ఎస్.ఐ గార్ల) పని చేశారు. ట్రయల్స్‌లో సాయికుమార్ (ఎస్.ఐ గార్ల), రవీందర్ (సీఐ-గార్ల, బయ్యారం) సహకరించారు. కేసు డాక్యుమెంటేషన్ బాధ్యతలను జే.రాజు (సీడీఓ) నిర్వహించారు.ఈ కేసు లో నిందితుడికి శిక్ష పడేలా సమర్థంగా పనిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ డా. శబరీష్ అభినందించారు.

Next Story