- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హన్మకొండ అదనపు కలెక్టర్ గా పని చేసిన వెంకట్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు
హన్మకొండ అదనపు కలెక్టర్ గా గతంలో పనిచేసి ఏసీబీ కి పట్టుబడిన వెంకట్‌రెడ్డి ఇంట్లో ఆ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

దిశ, వరంగల్ బ్యూరో : హన్మకొండ అదనపు కలెక్టర్ గా గతంలో పనిచేసి ఏసీబీ కి పట్టుబడిన వెంకట్‌రెడ్డి ఇంట్లో ఆ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఉన్న ఆయనకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, అనుబంధ ప్రదేశాల్లో ఒకేసారి తనిఖీలు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన నగదు, కీలక పత్రాలు, స్థిరాస్తుల వివరాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. హన్మకొండ అదనపు కలెక్టర్ గా పనిచేసి గత నెలలో ఎసిబి కి పట్టుబడ్డ వెంకట్ రెడ్డి ఇంట్లో ఎసిబి అధికారులు సోదా చేస్తున్నారు. గత నెలలో ఆయన ఒక పాఠశాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ విషయం లో 60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయనతో పాటు ఇద్దరు ఉద్యోగుల ను అదుపులోకి తీసుకున్నారు. వెంకట్ రెడ్డి పై నల్గొండ జిల్లాలో పనిచేసినప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. జనగామ లో పనిచేసినప్పుడు ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. సోదాలు పూర్తయ్యాక పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.






