వేలి ఉంగరం పోయిందని యువతి బలవన్మరణం

by Taduka Kalyani |   (  Updated:2023-03-28 16:15:01  IST  )

వేలి ఉంగరం పోయిందని బయపడి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దంతాలపల్లి మండల పరిధి గున్నేపల్లి గ్రామం జరిగింది.

వేలి ఉంగరం పోయిందని యువతి బలవన్మరణం
X

దిశ, దంతాలపల్లి: వేలి ఉంగరం పోయిందని బయపడి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దంతాలపల్లి మండల పరిధి గున్నేపల్లి గ్రామం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గున్నేపల్లి గ్రామానికి చెందిన మద్ధుల జానకిరాములు కుమార్తె మద్ధుల హేమలత రెడ్డి, హన్మకొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. తన చేతి వేలికి ఉన్న ఉంగరం హేమరుపాటులో ఎక్కడో జారిపోయింది. దీంతో భయపడిన హేమలత రెడ్ది సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకొని మరణించింది. మృతురాలు తండ్రి జానకి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story