గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

by velandi.Saikiran |

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు ఘాటనాస్థలిలో మృత్యువాత పడిన సంఘటన ఖానాపురం శివారులో చోటుచేసుకుంది.

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
X

దిశ, ఖానాపురం: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు ఘాటనాస్థలిలో మృత్యువాత పడిన సంఘటన ఖానాపురం శివారులో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట నుండి ఖానాపురం వెళ్ళే వైపుగా గల బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో సదరు యువకుడు అక్కడికి అక్కడే మృతి చెందాడు. మృతుడు ఖానాపురం మండలం మనుబోతుల గడ్డకు చెందిన దున్నపోతుల మంజులసంజీవ కొడుకు పేరు వాసుగా ప్రాథమికంగా గుర్తించారు. యువకుడు స్థానిక జయముఖి కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.

Next Story