- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత సామరస్యతకు ప్రతీక.. పుర బాధ్యతల స్వీకరణ
మున్సిపాలిటీ నూతన పాలక సభ్యులు బాధ్యతలను స్వీకరించారు. గురువారం పురపాలక కార్యాలయంలో మున్సిపల్ పాలకులు పాలన ప్రారంభించారు.

దిశ, డోర్నకల్ : మున్సిపాలిటీ నూతన పాలక సభ్యులు బాధ్యతలను స్వీకరించారు. గురువారం పురపాలక కార్యాలయంలో మున్సిపల్ పాలకులు పాలన ప్రారంభించారు. ఈ సందర్భంగా పుర చైర్ పర్సన్ రాజకుమారి హరిబాబు, వైస్ చైర్ పర్సన్ మాద లావణ్య శ్రీనివాస్ మాట్లాడారు. పట్టణ ప్రజలు తమ పై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని తెలిపారు. ప్రధాన సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాలకవర్గ సభ్యులతో కలిసి కుంటుబడిన అభివృద్ధిని పరుగులు పెట్టించి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుటకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే సెయింట్ ఆగ్నెస్ పాఠశాల కరస్పాండెంట్ ఆంతోని, ప్రిన్సిపల్ హెలెన్ రాణి పాలక సభ్యులను ఘనంగా సన్మానించారు. హిందూ,ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ యాదవ్, కమిషనర్ నిరంజన్, కౌన్సిలర్లు ఎల్లావుల సువర్ణ హరికృష్ణ, బానోతు ప్రమీల, బాదావత్ వీరన్న, దారావత్ విజయ రమేష్, బాదావత్ హేమలత, నవీన్ తేజావత్, గుగులోతు రాము, బోరగల శరత్, మల్లం ప్రవీణ అనిల్, బొబ్బల సంధ్య, బడేటి రామ్ కోటేష్, ఆంగోత్ శైలజ, గార రమేష్, మాజీ చైర్మన్ వీరన్న, మాజీ వైస్ చైర్మన్ కోటిలింగం, మాజీ కౌన్సిలర్ తేజావత్ సంధ్యరమేష్, తాళ్లూరి హనుమ, ఏపూరి రమణయ్య, ఆంగోత్ వెంకన్న పాల్గొన్నారు.






