రుద్రమ బ్రాండ్‌తో తెలంగాణ మహిళా ఆత్మగౌరవానికి కొత్త అధ్యాయం : ఎమ్మెల్యేరేవూరి ప్రకాశ్ రెడ్డి

by Ratna Kumari |

దామెర మండ‌లం ల్యాదెళ్ల గ్రామంలో మ‌హిళా శ‌క్తి వారోత్స‌వాల సంద‌ర్భంగా ప‌ర‌కాల స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రారంభోత్సవం, SGH వివో, వర్క్ షెడ్, జీఎం డైరీ సమావేశ మందిరం భవనాల‌కు వీ హబ్ సీఈవో సీతా పల్లాచోళ్ల తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

రుద్రమ బ్రాండ్‌తో తెలంగాణ మహిళా ఆత్మగౌరవానికి కొత్త అధ్యాయం : ఎమ్మెల్యేరేవూరి ప్రకాశ్ రెడ్డి
X

దిశ, దామెర : దామెర మండ‌లం ల్యాదెళ్ల గ్రామంలో మ‌హిళా శ‌క్తి వారోత్స‌వాల సంద‌ర్భంగా ప‌ర‌కాల స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రారంభోత్సవం, SGH వివో, వర్క్ షెడ్, జీఎం డైరీ సమావేశ మందిరం భవనాల‌కు వీ హబ్ సీఈవో సీతా పల్లాచోళ్ల తో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా సమైక్య సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ...ల్యాదళ్లలో రుద్రమ బ్రాండ్ తో తెలంగాణ మహిళా ఆత్మగౌరవం పేరుతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరకాల స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను ప్రారంభించుకోవడం గర్వకారణంగా ఉంద‌న్నారు. ల్యాద‌ళ్లలో డైరీ ఎప్పుడు ఎప్పుడు ప్రారంభిస్తామని ఎదురు చూసిన రోజు ఈ రోజు నెరవేరింది."రుద్రమ బ్రాండ్"తెలంగాణ మహిళల ఆర్థిక స్వాలంబన ఆత్మగౌరవం పెంచుతుంది. ల్యాదల్ల గ్రామంలో మహిళల కోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయబడిన‌ట్టు తెలిపారు.

యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం వీ-హబ్ (WE Hub) ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం, స్థానికంగా చిన్న తరహా తయారీ యూనిట్లలో ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ ప్రాజెక్టును 'WE Hub' (తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తల హబ్) స్థానిక జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న 'మహిళా శక్తి' వారోత్సవాల సందర్భంగా ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు ప్రతీకగా నిలుస్తున్నాయి అని అన్నారు. స్వయం సహాయక సంఘాలను పటిష్టం చేయడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం అన్నారు. వి హబ్ ను జిల్లా యంత్రాగాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. ఇక్కడ ఇచ్చే శిక్షణ తో నాణ్యతతో కూడిన ఉత్పత్తులను తయారుచేసి రుద్రమ బ్రాండ్ కి దేశవ్యాప్తంగా పేరు తెచ్చేలా మహిళలు తేవాలని మా నమ్మకాన్ని నిలబెట్టాలని అన్నారు. మహిళా సోదరిమణులలో కమిట్ మెంట్ తో పనిచేసే శక్తి ఉన్నదని అన్నారు.ఎన్ని అడ్డంకులు వచ్చినా వీరోచితం పోరాడిన రాణి రుద్రమ చరిత్రను తిరగరాసేలా ఇక్కడ తయారు చేసే ఉత్పత్తులకు రుద్రమ పేరు పెట్టడం మంచి పరిణామం అని అన్నారు. అభివృద్ధికి కావలసిన సౌకర్యాలు తాను కల్పిస్తానని మీరు మార్కెటింగ్ పెరిగేలా కృషి చేయాలని మహిళల ఆర్థిక కృషి చేయాలని వీ హబ్ నిర్వాహకులను కోరారు. నిజాయితీ నిబద్ధత పెట్టుబడిగా పరకాల ఇందిరా మహిళ పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Next Story