- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతుకుదెరువు కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వలస కూలీ
by Ratna Kumari |
బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఓ మహిళా ప్రాణాలు కోల్పోయింది.

X
దిశ, కొత్తగూడ : బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఓ మహిళా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మి గ్రామానికి చెందిన వాంకుడోతు వినోద్ (45), సోమ్ల దంపతులు హైదరాబాద్ కు వలస వెళ్లారు. అయితే కూలీ పని చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు సర్పంచ్ దేవేందర్ తెలిపారు. హైదరాబాద్ లోని భవన నిర్మాణ పనుల్లో వినోద నీళ్లు పడుతూ ఉండగా పైపు ను గట్టిగా లాగిన సమయంలో అదుపు తప్పి ఐదో అంతస్తు నుంచి కింద పడిపోయింది. తీవ్ర గాయాలవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే భార్య ప్రాణాలు కోల్పోవడంతో భర్త సోమ్లా తల్లడిల్లిపోయాడు. ఈ ఘటనతో ముష్మి గ్రామం మొత్తం శోకసంద్రంగా మారగా.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
Next Story






