గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ కీలక నిర్ణయం

by Kalyani |
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ కీలక నిర్ణయం
X

దిశ‌, హ‌న్మ‌కొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈసీ సమావేశం లో కమిటీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. క్లబ్ సాధారణ సభ్యుల కోసం స్పొర్ట్స్ నిర్వహించాలని నిర్ణ‌యించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమిటీపై పదేపదే దుష్ప్రచారం చేసే సభ్యులపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు పాటించని సభ్యుల సభ్యత్వాన్ని తొలగించాలని నిర్ణయించారు. గత కమిటీలో క్లబ్ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదురుకొంటున్న అధ్యక్ష, కార్యదర్శుల ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేస్తూ తీర్మానించారు. క్లబ్ ఆర్థిక లావాదేవీల విషయంలో చెక్ పవర్ ఉన్నవారు మాత్రమే అవకతవకలు జరిగితే బాధ్యులవుతారని, అలా కాకుండా చేసిన అక్రమాలకు కమిటీ మొత్తం బాధ్యత వహిస్తుందని కొందరు పనిగట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఈసీ సమావేశం తీవ్రంగా ఖండించింది.

గత కమిటీ చేసిన అవకతవకలపై భవిష్యత్తులో లీగల్ గా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే అందుకు తగిన ఫీజులు క్లబ్ నుంచి చెల్లించాలని నిర్ణయించారు. క్లబ్ ఆవరణలో సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించటానికి ఒక ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేయాలని, ప్రతీ వారం వాటిపై సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఈసీ సమావేశంలో ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కొశాధికారి బొల్ల అమర్, ఉపాద్యక్షులు గోకారపు శ్యాం, బొడిగె శ్రీను, కొడిపల్లి దుర్గాప్రసాద్, అల్లం రాజేశ్ వర్మ, యాంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్థన్, ఈసీ మెంబర్లు, వీరగోని హరీష్, జనగాని ఆంజనేయులు, యండి నయీంపాషా, కమటం వేణుగోపాల్, కందుకూరి సంజీవ్, నన్నపనేని భరత్, మంచాల రాజు, బాలవారి విజయ్ పాల్గొన్నారు.

Next Story