బచ్చన్నపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి

by velandi.Saikiran |

మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా వద్ద నిరసన చే

బచ్చన్నపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి
X

దిశ, బచ్చన్నపేట : మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా వద్ద నిరసన చేసారు. మండల కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక ఉన్నత చదువుల కొరకు విద్యార్థులు జిల్లా సెంటర్ కు వెళ్లి చదువుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించుకోవడం సిగ్గుచేటు అన్నారు.జూనియర్ కళాశాల ఏర్పాటు చేసేంతవరకు ఎస్ఎఫ్ఐ ఉద్యమాన్ని ముందుకు సాగిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరవింద్, అఖిల్ ,శ్రీధర్ ,కమల్, రాకేష్, అరవింద్ ,సతీష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story