భర్త చేతిలో హతమైన భార్య...తాగ‌డానికి డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని

by velandi.Saikiran |

తిరుమలపురం గ్రామంలో పండగ పూట భార్య‌ను హ‌త్య చేశాడు ఓ భ‌ర్త‌.

భర్త చేతిలో హతమైన భార్య...తాగ‌డానికి డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని
X

దిశ, చిట్యాల: మండలంలోని తిరుమలపురం గ్రామంలో పండగ పూట భార్య‌ను హ‌త్య చేశాడు ఓ భ‌ర్త‌. గ్రామానికి చెందిన లింగయ్య ఎప్పుడు మద్యం తాగుతూ ఉంటాడట‌. అయితే... మంగళవారం మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వమని అడిగితే భార్య ప్రమీల ఇవ్వలేదని స‌మాచారం. దీంతో భార్యతో గొడవపడి రోకలి బండతో ప్రమీలను కొట్టి చంపాడు భ‌ర్త. ఇక‌ కొడుకు కనుకుంట్ల సురేష్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపారు.

Next Story