- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టుల పిల్లలకు ఇంటర్మీడియట్ విద్యలో 50 శాతం ఫీజు రాయితీ
ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్‌జేయూ) చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

దిశ, హనుమకొండ కలెక్టరేట్: ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్‌జేయూ) చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. టీఎస్‌జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గణపనేని చంద్రశేఖర్ సమర్పించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకున్న ఇన్‌చార్జి వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఇంటర్మీడియట్ విద్య) -హనుమకొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఏ. గోపాల్, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని సర్క్యులర్ జారీ చేశారు. ఈ నిర్ణయంతో జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందని, విద్యార్థులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హనుమకొండ జిల్లా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.






