- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
214.370 కిలోల గంజాయి పట్టివేత
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామ జాతీయ రహదారిపై 214.370 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

214.370 కిలోల గంజాయి పట్టివేత
- హన్మకొండ జిల్లాలో పట్టుకున్న పోలీసులు
- నిందితుడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తింపు
దిశ, వర్ధన్నపేట: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామ జాతీయ రహదారిపై 214.370 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈమేరకు సోమవారం ఏసీపీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏసీపీ వెంకటేష్ మాట్లాడుతూ.. స్థానిక ఎస్సై పస్తం శ్రీనివాస్ వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్రకు చెందిన శివ సింగ్ కారులో ఖమ్మం నుంచి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులను చూసిన ఆయన కారు వెనక్కి తిప్పేందుకు ప్రయత్నించగా అనుమానం వచ్చిన పోలీసులు కారును ఆపి తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. నిందితుడిని విచారించగా గంజాయిని తరలిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. పట్టుబడిన గంజాయి 214.370 కిలోలతో పాటు మూడు సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై శ్రీనివాస్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. కార్యక్రమంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.






