గంజాయి కేసు నిందితులకు 20 ఏళ్ల జైలు

by Ratna Kumari |

గంజాయి తరలింపు కేసులో ఐదుగురు నిందితులకు బుధవారం శిక్ష ఖరారు అయింది. ఆత్మకూరు సీఐ ఆర్. సంతోష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

గంజాయి కేసు నిందితులకు 20 ఏళ్ల జైలు
X

దిశ, ఆత్మకూరు : గంజాయి తరలింపు కేసులో ఐదుగురు నిందితులకు బుధవారం శిక్ష ఖరారు అయింది. ఆత్మకూరు సీఐ ఆర్. సంతోష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు మండలం చౌళ్ళపల్లి గ్రామ పరిసరాల్లో 2017 డిసెంబర్ 12న విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు 100 కిలోల గంజాయిని తరలిస్తుండగా ఆత్మకూరు పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. హనుమకొండ జిల్లా మొదటి అదనపు కోర్టు న్యాయమూర్తి బి‌‌.అపర్ణ దేవి గంజాయి కేసులో పట్టుబడిన ఐదుగురు నిందితులకు బుధవారం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తో పాటు,ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించారు. నిందితులు పావురాల వెంకటేష్ ( సూరంపెట,) అబ్బోజు వెంకటేష్(గట్ల కనపర్తి), పరిపల్లి కార్తిక్(గట్ల కనపర్తి), అనంతుల సాంబయ్య (గట్ల కనపర్తి), కొక్కరకొండ చంద్రయ్య(చౌళ్ళపల్లి) లుగా ఉన్నారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాజమల్లా రెడ్డి వాదించగా.. కోర్టు కానిస్టేబుల్ ఆర్.ఉమేష్ సాక్షులను ప్రవేశపెట్టారు. సకాలంలో సాక్షులను కోర్టుకు ప్రవేశపెట్టి నిందితులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన కోర్టు కానిస్టేబుల్ ఉమేష్ ను పోలీసు అధికారులు అభినందించారు.

Next Story