- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోడిపందాలు ఆడుతున్న 11 మంది అరెస్ట్..
by Taduka Kalyani |
కోడిపందాలు ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో జరిగింది.

X
దిశ, ఏటూరు నాగారం: కోడిపందాలు ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో జరిగింది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. వాజేడు మండల పరిధి చెరుకూరు గ్రామ శివారులో కొంతమంది కోడిపందాలు ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు వాజేడు ఎస్ఐ అశోక్ తన బృందంతో కలిసి కోడిపందాలు నిర్వహిస్తున్న స్థావరాలపై దాడులు నిర్వహించారు.
కాగా కోడిపందాలు ఆడుతున్న రొయ్యూరు గ్రామానికి కు చెందిన 11మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 36,900, 3 పందెం కోడిపుంజులు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిపై కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. .
Next Story






