- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Medaram Jatara 2026: మేడారంలో108 దుర్వినియోగం
మేడారం 108 లో విధులు నిర్వహిస్తున్న కొందరి సిబ్బంది నిర్వాకం వైద్య ఆరోగ్య శాఖకు మచ్చ తెచ్చేవిధంగా ఉంది. ఎసెన్సియల్ సప్లై వెహికిల్ అనుమతులతో జాతరలో బాదితులకు తక్షణ వైద్య సేవలు అందించాల్సిన 108 సిబ్బంది విధులకు ఎగనామం పెట్టి అక్రమ దందాకు తెరలేపి వైద్య ఆరోగ్య శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు.

దిశ, మేడారం నెట్ వర్క్: మేడారం 108 లో విధులు నిర్వహిస్తున్న కొందరి సిబ్బంది నిర్వాకం వైద్య ఆరోగ్య శాఖకు మచ్చ తెచ్చేవిధంగా ఉంది. ఎసెన్సియల్ సప్లై వెహికిల్ అనుమతులతో జాతరలో బాదితులకు తక్షణ వైద్య సేవలు అందించాల్సిన 108 సిబ్బంది విధులకు ఎగనామం పెట్టి అక్రమ దందాకు తెరలేపి వైద్య ఆరోగ్య శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. మేడారం జాతరకు భక్తులను అంబులెన్స్‌లలో తరలిస్తూ అక్రమ దందాకు తెరలేపి భక్తులను రవాణా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఎసెన్షియల్ సప్లైస్ వెహికల్ పాస్‌తో సైరన్ వేసుకుంటూ ఎమర్జెన్సీ సర్వీస్ అంటూ ట్రిప్పులు తాడ్వాయి మెయిన్ గేటు నుండి కొందరు డాక్టర్ల కుటుంబాలను వారి బంధువులను మేడారం మహాద్వారం వరకు తరలిస్తున్న వైనాన్ని కొందరు భక్తులు పసిగట్టి పట్టుకుని బండారాన్ని బయటపెట్టారు. వైద్యశాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించిన 108 సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






