- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రం అత్యధిక నిధులిచ్చింది వరంగల్ కార్పొరేషన్ కే
కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ సహా రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కు ఇవ్వనన్ని నిధులను కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం వరంగల్ కార్పొరేషన్ కు ఇచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

దిశ, వరంగల్ బ్యూరో : కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ సహా రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కు ఇవ్వనన్ని నిధులను కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం వరంగల్ కార్పొరేషన్ కు ఇచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వరంగల్ లో బుధవారం జరిగిన ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పాలకుల అవినీతివల్ల ఆ నిధులన్నీ దుర్వినియోగమయ్యాయని మండిపడ్డారు. కేంద్ర నిధుల దుర్వినియోగం, డైవర్షన్ పై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్రం ఇంతపెద్ద ఎత్తున నిధులిస్తున్నా కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరువల్లే అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే అభివ్రుద్ధి అంటే ఏమిటో చూపిస్తామని, కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాబడతామనే విషయాన్ని ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లాలని చెప్పారు. దీంతోపాటు ఇకపై యుద్ద ప్రాతిపదికన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, స్థానిక సమస్యలపై ఉధృతంగా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఏ రాజకీయ పార్టీకైనా ఒక లక్ష్యం ఉంటుంది. ప్రధానంగా అధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తాయి. ఆ అధికారం కోసం తమ సిద్ధాంతాలను, విధానాలను కూడా పక్కనపెట్టి పనిచేస్తాయని అన్నారు. లక్ష్య సాధన కోసం అనేక తప్పుడు మార్గాల్లో నడుస్తూః సిద్దాంతాలను కూడా తుంగలో తొక్కుతాయని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే అందుకు నిదర్శనం. కానీ నాటి జనసంఘ్ నుండి నేటి భారతీయ జనతా పార్టీ వరకు ఎన్నడూ సిద్దాంతాన్ని పక్కన పెట్టకుండా ఆశయాలను కొనసాగిస్తున్నా ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. కమిట్ మెంట్ బీజేపీ కార్యకర్తల సొంతం అన్నారు. ఏ పార్టీకైనా సిద్ధాంతాలనేవి పునాది లాంటివి. పునాది గట్టిగా ఉంటే ఇల్లు పటిష్టంగా ఉంటుందన్నారు. బీజేపీ సిద్ధాంతాలు పటిష్టంగా ఉన్నాయి కాబట్టే ఇద్దరి ఎంపీల నుండి మొదలైన ప్రస్థానం వరుసగా మూడుసార్లు అధికారంలోకి రాగలిగిందన్నారు. పార్టీ 21 రాష్టాల్లో అధికారంలో కొనసాగుతున్నాం. బెంగాల్, త్రిపుర వంటి కమ్యూనిస్టుల, టీఎంసీ కంచు కోటలను బద్దలు కొట్టి అధికారంలోకి రాగలిగామన్నారు. బీజేపీ నిర్దేశించుకున్న ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదాన్ని అమలు దిశగా కొనసాగుతున్నామన్నారు. హామీలిచ్చి మోసం చేసే పార్టీ బీజేపీ కాదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడి అధికారంలో రావడమే బీజేపీ లక్ష్యం అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విరక్తి పుట్టిందన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజలకు నమ్మకం లేదు. వాళ్లు ఏ పోరాటాలు చేసినా జనం వాళ్లకు మద్దతివ్వడం లేదన్నారు. అందుకే ఈసారి బీజేపీకి ఓటేసి గెలిపించాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మహిళలు కాంగ్రెస్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నారన్నారు. మహిళలు సెంటిమెంట్ కు ప్రతీక. వాళ్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పట్ల కసితో ఉన్నారన్నారు. రైతులు సైతం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. వడ్ల కొనుగోళ్లు లేక రైతులు పడుతున్న కష్టాలను కళ్లారా చూస్తున్నా.. ప్రజలను కలిసి వారిలో నమ్మకం కలిగించడంలో క్షేత్రస్థాయిలో బీజేపీ నాయకులు వెనుకబడి ఉన్నారన్నారు. త్వరలో హన్మకొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఇక్కడ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కరీంనగర్ కు, వరంగల్ కు పెద్ద తేడా లేదన్నారు. వరంగల్ స్మార్ట్ సిటీ, అమ్రుత్ 1, 2 కింద కేంద్రం పెద్ద ఎత్తున నిధులిచ్చిందన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మరో రూ.4600 కోట్లు మంజూరయ్యాయి. ఇవిగాకుండా కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్ టైల్ పార్క్, జాతీయ రహదారుల నిర్మాణం సహా పెద్ద ఎత్తున కేంద్రం నిధులిచ్చిందన్నారు. దురద్రుష్టమేందంటే కరీంనగర్ లో స్మార్ట్ సిటీ నిధులను వినియోగించుకుని అభివ్రుద్ధి చేస్తే, వరంగల్ లో మాత్రం స్మార్ట్ సిటీ నిధులన్నీ డైవర్ట్ అయ్యాయన్నారు. అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. వీటిపై ఉద్యమాలు చేయడంలో వరంగల్ బీజేపీ నాయకులు వెనుకబడి ఉన్నారన్నారు.
వరదలొస్తే హంటర్ రోడ్ మునిగిపోతది. కాజీపేట పరిసరాల్లోని రాంపూర్ డంపింగ్ యార్డ్ (ల్యాండ్‌ఫిల్) చుట్టుపక్కల గ్రామాల ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. దీనిపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. నగర పరిధిలో (ముఖ్యంగా వరంగల్ వెస్ట్, ఈస్ట్ నియోజకవర్గాల్లో) వేలాది మంది అర్హులైన పేదలకు ఇప్పటికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించలేదన్నారు. పూర్తయిన ఇండ్లు కూడా పంపిణీకి నోచుకోక పాడుబడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన "ఇందిరమ్మ ఇండ్ల" హామీ కూడా క్షేత్రస్థాయిలో ఇంకా వేగం అందుకోలేదన్నారు. పేదల పక్షాన పోరాడటంలో వెనుక బడి ఉన్నాం. హన్మకొండలో కేంద్ర నిధుల భాగస్వామ్యంతో ఇరుకు రోడ్లను విస్తరిస్తున్నారన్నారు. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదన్నారు.






