కొండా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వరంగల్ కాంగ్రెస్ నేతల అత్యవసర భేటీ

by Ajay Maddhiboyina |

మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలపై వరంగల్ కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు. నిన్న ఓ సమావేశంలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

కొండా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వరంగల్ కాంగ్రెస్ నేతల అత్యవసర భేటీ
X

దిశ‌, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలపై వరంగల్ కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు. నిన్న ఓ సమావేశంలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నాడని విమర్శించారు. అంతే కాకుండా పరకాలలో 75ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా ఉన్నాడని ఘాటు విమర్శలు చేశారు. అక్కడ నుండి వచ్చే ఎన్నికల్లో తమ కూతురు పోటీ చేస్తుందని చెప్పారు.

వరంగల్‌లో తను ఉన్నంత కాలం రెండో లీడర్ రాడని కొండా మురళి స్పష్టంచేశారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్‌లో దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నేత‌లంతా ఏక‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలు, కీల‌క నేత‌లు అత్య‌వ‌స‌ర భేటీ అయ్యారు. స‌మావేశమైన వారిలో క‌డియం శ్రీహ‌రి, రేవూరి ప్రకాష్ రెడ్డి, సార‌య్య‌, సుధారాణి, నాయిని, గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌, నాగ‌రాజు ఉన్నారు.

Next Story