- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీభవన్‌లో వరంగల్ కాంగ్రెస్ నేతల సమావేశం
గాంధీభవన్‌లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. మంత్రి అడ్లూరి లక్షణ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: గాంధీభవన్‌లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. మంత్రి అడ్లూరి లక్షణ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటు మరియు ఇతర అంశాలపై సమావేశంలో నేతలు చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క మరియు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ఇది పార్టీకి సంబంధించిన సమావేశమని అన్నారు.
ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం మామూలేనని కానీ పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇటీవల వరంగల్ కాంగ్రెస్‌లో రాజకీయాలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా మురళి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఓరుగల్లు రాజకీయాలు వేడెక్కాయి. నేతలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడంతో కొండా మురళి కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.






