రూ.508 కోట్లతో అభివృద్ధి.. శంకుస్థాపన చేసిన CM రేవంత్

by Gantepaka Srikanth |

రూ.508 కోట్లతో అభివృద్ధి.. శంకుస్థాపన చేసిన CM రేవంత్

రూ.508 కోట్లతో అభివృద్ధి.. శంకుస్థాపన చేసిన CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శ్రీకారం చుట్టారు. రూ.508 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. నర్సంపేట-నెక్కొండ 4 లేన్ల రోడ్డు నిర్మాణం, హనుమకొండ-మహబూబాబాద్‌ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. దాంతో పాటు నర్సంపేటలో నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. మరోవైపు.. నర్సంపేటలో జరిగే ప్రజా పాలన విజయోత్సవ సభ గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల గెలుపునకు దోహదపడుతుందనే దీమాతో ఉన్నారు. సభ ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలకు పలు కీలక హామీలు ఇవ్వడంతో పాటు పూర్తిస్థాయిలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శంకుస్థాపనలు చేస్తుండటంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారికి కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కీలక స్థానాలన్నీ కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది.

Next Story