Warangal: ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి

by Ramesh Goud |   (  Updated:2025-01-11 05:26:23  IST  )

ఆన్‌లైన్ బెట్టింగ్(Online Bettings) భూతానికి వరంగల్ జిల్లా(Warangal District)లో మరో యువకుడు బలి అయ్యాడు.

Warangal: ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి
X

దిశ, వెబ్ డెస్క్: ఆన్‌లైన్ బెట్టింగ్(Online Bettings) భూతానికి వరంగల్ జిల్లా(Warangal District)లో మరో యువకుడు బలి అయ్యాడు. బెట్టింగులకు అలవాటు పడి చాలా మంది యువకులు డబ్బులతో పాటు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్ లపై నిషేదం విధిస్తున్నా.. ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వాహకులు ఇతర మార్గాల ద్వారా యువకులకు వల వేసి, బలి చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ బెట్టింగులు మరో ప్రాణం తీసుకున్నాయి. వర్దన్నపేట(Vardhannapeta) మండలం ఇల్లంద గ్రామానికి(Illanda Village) చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటు పడి, భారీగా అప్పులు చేశాడు. బెట్టింగ్ యాప్‌లలో సూమారు 30 లక్షలు కోల్పోయాడు. చేసిన అప్పు తీర్చలేక మనస్థాపానికి గురై ఇంట్లో ఊరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.

Next Story