ఈ నెల 25న వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-17 12:09:57  IST  )

గ్రామ పాలన అధికారుల పోస్టుల కోసం స్క్రీనింగ్ పరీక్షను ఈనెల 25న నిర్వహిస్తున్నట్లు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ శనివారం ప్రకటించారు.

ఈ నెల 25న వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ పాలన అధికారుల పోస్టుల కోసం స్క్రీనింగ్ పరీక్షను ఈనెల 25న నిర్వహిస్తున్నట్లు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ శనివారం ప్రకటించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ http://ccla.telangana.gov.in/‌లో ఉంచుతామని ప్రకటించారు. పరీక్షా కేంద్ర వివరాలు కూడా హాల్‌టికెట్లలోనే ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, అవసరమైన సూచనలు హాల్‌టికెట్‌లో పొందుపరిచారు. అవసరమైనప్పుడు మరింత సమాచారం, స్పష్టత కోసం సమయానుసారంగా తెలియజేస్తామని స్పష్టం చేశారు.

అయితే, ఈ నెల 25న పరీక్ష నిర్వహించబోతున్నారని అందరి కంటే ముందుగానే ‘దిశ’ చెప్పింది. ప్రతి జిల్లాలోనూ పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేయాలని గతంలోనే కలెక్టర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఏ జిల్లాకు చెందిన వీఆర్వో, వీఆర్‌ఏలు ఆ జిల్లాలోనే స్క్రీనింగ్ టెస్టుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. పరీక్ష ఏ పద్ధతిన ఉంటుందన్న అంశంపై అభ్యర్థులకు సందేహాలు ఉన్నాయి. అయితే, జీపీవో చేయబోయే విధులు, బాధ్యతలపైనే ప్రశ్నలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్ధులంతా గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన వారే కావడంతో వారందరికీ జాబ్‌ చార్ట్‌పై కనీస అవగాహన ఉంది. కఠినతరమైన ప్రశ్నలేవీ ఉండబోవని తెలుస్తోంది. ఎలాగైనా పోస్టుల కంటే దరఖాస్తుల సంఖ్య తక్కువే ఉన్న క్రమంలో ఆ విషయం కూడా హాల్ టికెట్‌లోనే ఉండొచ్చునని భావిస్తున్నారు.

Next Story