- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయంత్రం 5 గంటల తర్వాత లోపలికి అనుమతించరు.. కానీ ఓటు వేయవచ్చు..!
తెలంగాణలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తుతున్నారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 11 గంటల తర్వాత ఊపందుకుంది.

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తుతున్నారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 11 గంటల తర్వాత ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. 5 గంటల తర్వాత ఏ ఒక్కరినీ లోపలికి అనుమతించరు.
అయితే 5 గంటల తర్వాత కూడా ఓటేయ్యవచ్చని చెబుతున్నారు ఎన్నికల అధికారులు. అది ఎలా అంటే పోలింగ్ కేంద్రాల్లోకి సాయంత్రం 5 గంటల వరకే ఎంట్రీ ఉన్నప్పటికీ ఆ సమయం లోపు సెంటర్ లోపలికి వెళ్లిన వారికి అవకాశం ఉంటుంది. పదులు, వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నా ఎన్నికల అధికారులు ఓటు వేసే అవకాశం ఇస్తారు. కానీ 5 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించరు. ఈ విషయాన్ని ఓటర్లు గ్రహించి పోలింగ్ సమయంలోపు కేంద్రాలకు రావాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు.






