- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఓటరు జాబితా ప్రక్షాళన.. సీఈఓ సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు
భారత ఎన్నికల సంఘం రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భారత ఎన్నికల సంఘం రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కెఆర్ భవన్‌లో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ఉప ప్రధాన ఎన్నికల అధికారి (ఎఫ్‌ఏసీ) జి.ఎస్. చారిలతో కలిసి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ.కర్ణన్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. మనుచౌదరి, సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓలు) హాజరయ్యారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) కీలక పాత్ర పోషిస్తున్నందున వారికి తగిన శిక్షణ ఇవ్వాలని ఈఆర్ఓలకు సూచించారు. అలాగే బీఎల్ఓల పనివిధానంపై నిరంతరం సమీక్షిస్తూ, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే ఎత్తైన అపార్ట్‌మెంట్ భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలపై ప్రత్యేక దృష్టి సారించి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని ఈఆర్ఓలకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా మురికివాడలలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ ప్రక్రియను మరింత సరళతరం చేయడానికి ఎన్యూమరేషన్ ఫారాలు ఆంగ్లం, తెలుగు భాషాల్లో ఉంటాయని తెలిపారు. అలాగే వీఐపీ, వీవీఐపీ ఓటర్ల మ్యాపింగ్ సక్రమంగా జరిగేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణలో పాలుపంచుకున్న క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రోత్సహించేందుకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బీఎల్ఓలకు ‘బెస్ట్ బీఎల్ఓ అవార్డు’ అందజేయనున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు.






