ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Bhoopathi Nagaiah |

రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​చీఫ్ కిషన్​ రెడ్డి కోరారు.

ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​చీఫ్ కిషన్​ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన హైదరాబాద్‌లోని చార్మినార్​భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని, తెలంగాణలో గురువారం ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ప్రజలెవరూ డబ్బులు సహా ఇతర ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణ అవినీతి రహిత, ప్రజాస్వామ్యయుత రాష్ట్రంగా వెల్లివిరియాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.

17 రోజుల తర్వాత 41 మంది కార్మికులు సొరంగం నుంచి సురక్షితంగా బయటకు వచ్చారని, ఇది నిజంగా గొప్ప విషయమన్నారు. వారంతా క్షేమంగా ధైర్యంగా బయటకు వచ్చినందుకు అమ్మవారికి ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్చలు జరిపి కార్మికులను బయటకు తీసుకురావడం గొప్ప విషయంగా అభివర్ణించారు.

Next Story