వివేక్ vs హరీష్ రావు.. రేషన్ కార్డులపై మాటల యుద్ధం

by Muthe.Rajitha |

కాంగ్రెస్ మంత్రి వివేక్ వెంకటస్వామి, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

వివేక్ vs హరీష్ రావు.. రేషన్ కార్డులపై మాటల యుద్ధం
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ మంత్రి వివేక్ వెంకటస్వామి, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రేషన్ కార్డుల పంపిణీపై ఇరు నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఈ వివాదం ఇటీవల సిద్దిపేటలో జరిగిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో మొదలైంది. సిద్దిపేట కలెక్టరేట్‌లో జరిగిన కొత్త రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమంలో మంత్రి వివేక్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయలేదని వివేక్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే లక్షలాది రేషన్ కార్డులు అందించామని అన్నారు.

ఇక దీనికి హరీష్ రావు కౌంటర్ ఇస్తూ.. తమ ప్రభుత్వ హయాంలో "6.50 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని వివేక్ నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అలాగే సభలో ప్రోటోకాల్ పాటించలేదని హరీష్ వర్గీయులు నిరసనలు, నినాదాలు చేయగా.. మరోవైపు కాంగ్రెస్ వర్గీయులు కూడా సభలో నినాదాలు ఇస్తూ తోపులాటకు దిగారు. దీంతో పోలీసులు కలుగజేసుకొని గులాబీ శ్రేణులను బయటికి తీసుకువెళ్లారు.

Next Story