- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VHP: దేశం విషాదంలో ఉంటే.. ఇక్కడ అందాల పోటీలా? మిస్‌వరల్డ్ పోటీలపై వీహెచ్‌పీ ఆగ్రహం
తెలంగాణలో నిర్వహించనున్న మిస్‌వరల్డ్-2025 పోటీలపై వీహెచ్‌పీ (విశ్వహిందూ పరిషత్) ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో నిర్వహించనున్న (Miss World pageants) మిస్‌వరల్డ్-2025 పోటీలపై వీహెచ్‌పీ (విశ్వహిందూ పరిషత్) (Vishwa Hindu Parishad) ఆగ్రహం వ్యక్తం చేసింది. కాశ్మీర్‌లో హిందువుల రక్తంతో తడిసి దేశం విషాదంలో ఉంటే, తెలంగాణలో అందాల పోటీలు నిర్వహించడం సిగ్గుచేటని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి రావినూతల శశిధర్ (Ravinuthala Shashidhar) ఆగ్రహించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందాల కాశ్మీరం హిందువుల రక్తంతో తడిసి యావత్ దేశం విషాదంలో ఉంటే తెలంగాణలో ప్రపంచ సుందరీమణుల అందాలు ఆరబోసే పోటీలు నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి త్రివిధ దళాలు సరిహద్దులలో కవాతు నిర్వహిస్తుంటే తెలంగాణా ప్రభుత్వం మన శత్రుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, కెనడా అందాల భామలతో కవాతు నిర్వహించడానికి సిద్దమవుతుండటం సిగ్గుచేటన్నారు.
దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ అక్రమ చొరబాటుదారులను అరెస్టు చేసి వెనక్కి పంపే పనిలో ఉంటే తెలంగాణ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం గడిచిన మూడు నెలలుగా ప్రపంచ అందాల పోటీల ఏర్పాట్లలో నిమగ్నమై దేశ అంతర్గత భద్రతను గాలికొదిలేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీలను రద్దు చేసుకొని అక్రమ వలసదారులు పై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ఆవేశం ఆక్రోశం కట్టలు తెంచుకోకముందే ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలని సూచించారు.






