- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిస్ వరల్డ్ -2025 పోటీలను రద్దు చేయాలి : విశ్వహిందూ పరిషత్
రేపటి నుంచి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ -2025 (Miss World -2025) పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే భామలు, న్యాయ నిర్ణేతలు, అతిథులు అంతా ఇప్పటికే నగరానికి చేరుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మిస్ వరల్డ్ పిస్కోవాతో సహా 111 దేశాల నుంచి సుందరీమణులంతా హైదరాబాద్ కు చేరుకున్నారు. రేపటి నుంచి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ -2025 (Miss World -2025) పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే భామలు, న్యాయ నిర్ణేతలు, అతిథులు అంతా ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. భారత్ - పాక్ ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అందాలపోటీల్లో ఎలాంటి తప్పిదం జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో నగరంలో మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేసింది. శత్రుదేశాల ప్రతినిధులతో పోటీలు ఎలా జరుపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చొరబాటుదారులను వెంటనే హైదరాబాద్ నుంచి వెనక్కి పంపించాలని విశ్వహిందూ పరిషత్ కోరింది.
Next Story






