Visakha-Charlapalli: ఓవైపు పండుగ రద్దీ.. ఖాళీగా విశాఖ-చర్లపల్లి రైలు.. ఎందుకు?

by Ramesh Naini |

నాలుగు రోజుల పాటు సంక్రాంతి పండుగను తమ సొంతూళ్లలో జరుపుకున్న ప్రజలు హైదరాబాద్‌కు పయనమయ్యారు.

Visakha-Charlapalli: ఓవైపు పండుగ రద్దీ.. ఖాళీగా విశాఖ-చర్లపల్లి రైలు.. ఎందుకు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాలుగు రోజుల పాటు సంక్రాంతి (Sankranti) పండుగను తమ సొంతూళ్లలో జరుపుకున్న ప్రజలు హైదరాబాద్‌కు పయనమయ్యారు. దీంతో బస్సులు, రైల్వే స్టేషన్‌లు తిరుగు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సులు, రైళ్లు ఎక్కడ చూసిన ప్రయాణికుతో నిండిపోయారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఓవైపు రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. (Visakha-Charlapalli) విశాఖ నుంచి చర్లపల్లి వెళ్లే సికింద్రాబాద్‌ జనసాధారణ్‌ రైలు ఖాళీగా తిరిగి వచ్చేసింది. రిజర్వేషన్‌ అవసరం లేకుండా సామాన్య ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది.

రైల్వే అధికారులు ఎలాంటి ప్రచారం చేయకపోవడం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. పావుగంట ఆలస్యంగా విశాఖ నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ రైలు బయలుదేరింది. ఇటీవల రూ.413 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్‌ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించిన విషయం విదితమే. ఇకపై సికింద్రాబాద్‌కు బదులుగా చాలా ట్రైన్‌లు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో హాల్టింగ్ చేయనున్నాయి. అయితే సంక్రాంతి సందర్భంగా చర్లపల్లి నుంచి రైళ్లను పలుప్రాంతలకు నడుపుతున్నట్లు (South Central Railway) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అయితే రైల్వే అధికారుల నుంచి ఎలాంటి ప్రచారం లేకపోవడంతో విశాఖ-చర్లపల్లి రైలు కాస్త ఖాళీగా దర్శనమిచ్చింది.

Next Story