- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Be Careful: జర జాగ్రత్త! కుక్కల ద్వారా చిన్నారికి సోకిన వైరస్ కలకలం..
కుక్కల ద్వారా చిన్నారికి వైరస్ సోకినట్లుగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో కలకలం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కుక్కల (dogs) ద్వారా చిన్నారికి వైరస్ సోకినట్లుగా (Rajanna Siricilla district) రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ (4) అనే చిన్నారికి జ్వరం, అలర్జీ రావడంతో సిరిసిల్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఎన్ని పరీక్షలు చేసినా వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో చిన్నారిని తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు "బ్రూసెల్లా ఇథిపికల్" అనే వైరస్ (Virus) సోకిందని, ఇది సామాన్యంగా కుక్కలకు వచ్చే వైరస్ అని తేల్చారు. ఆ వైరస్ వచ్చిన కుక్కల మధ్య ఆడుకోవడంతో చిన్నారికి కూడా సోకి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇంకా ఈ వ్యాధిపై వైద్యులు ఆరా తీస్తున్నారు. దీంతో సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఊరకుక్కల నుంచి చిన్నారులను దూరంగా ఉంచాలని పలువురు తల్లిదండ్రులకు జాగ్రత్తలు చెబుతున్నారు.






