జోడో యాత్రలో ఆసక్తికర సంఘటన.. అందరినీ పరిగెత్తించిన రాహుల్ గాంధీ (వీడియో)

by S Gopi |   (  Updated:2023-04-13 17:15:54  IST  )

భారత్ జూడో యాత్రలో ఆదివారం ఉదయం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున ...Viral Video: Revanth reddy running with rahul gandhi

జోడో యాత్రలో ఆసక్తికర సంఘటన.. అందరినీ పరిగెత్తించిన రాహుల్ గాంధీ (వీడియో)
X

దిశ, జడ్చర్ల /రాజాపూర్: భారత్ జూడో యాత్రలో ఆదివారం ఉదయం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 5.50 గంటలకు ఆరంభమైన భారత్ జూడో యాత్రలో పాల్గొనేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జాతీయ నాయకులు జై రామ్ రమేష్, ఉత్తం కుమార్ రెడ్డితోపాటు వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి రాహుల్ ముందుకు కదిలారు. రాజాపూర్ మండల కేంద్రం మీదుగా ప్రయాణం చేస్తూ ఉండగా తనను కలవడానికి వచ్చిన చిన్నారులతో సరదగా మాట్లాడుతూ తనతో పరుగు పెట్టగలరా .? అని అడుగగా తప్పకుండా... అని చిన్నారులు అనగానే... ఎవరు ఊహించని విధంగా రాహుల్ గాంధీ పరుగు అందుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు, మిగతా శ్రేణులంతా అనుసరించి పరుగులు పెట్టారు. కానీ రాహుల్ ను దాటడం ఎవరి తరం కాకపోవడం విశేషం. అనుకోని ఈ సంఘటనతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

Next Story