మామ, అల్లుళ్ల ద్రోహాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టారు: విప్​ ఆది శ్రీనివాస్

by Ajay Maddhiboyina |

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్​నేత హరీష్ రావు బాగోతం బయటపడిందనే బుకాయింపు మాటలు మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

మామ, అల్లుళ్ల ద్రోహాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టారు: విప్​ ఆది శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ​నేత హరీష్ రావు బాగోతం బయటపడిందనే బుకాయింపు మాటలు మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా సెంటర్​లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రానికి మామ, అల్లుడు కలిసి చేసిన జల ద్రోహాన్ని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి బయటపెట్టారని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉండి అడ్డగోలుగా వ్యవహారించిన కేసీఆర్, హరీష్ రావు ఇప్పుడు నీతి వ్యాఖ్యాలు వల్లిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి బనకచర్ల అంశాన్ని ఉపయోగించుకునే నీచ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టును కాంగ్రెస్​ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిలు కేంద్రానికి ఫిర్యాదు చేశారని తెలిపారు. గతంలో కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలని సంతకం చేసేందే కేసీఆర్, హరీష్ రావు అని పేర్కొన్నారు. దీన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించడంతో 405 టీఎంసీలు ఇవ్వాలని మాట మార్చారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి 500 టీఎంసీ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ అడిగిన దాని కంటే 100 టీఎంసీలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నామన్నారు. బనకచర్ల పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు తలో విధంగా మాట్లాడుతున్నారన్నారు. బనకచర్ల పై అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తామన్నారు. తెలంగాణ రైతులు రైతు భరోసాతో ఆనందంగా ఉన్నారని, దాన్ని చూసి ఓర్వ లేక హరీష్ రావు బనకచర్లపై హడావిడి చేస్తున్నారని విప్​ఆది శ్రీనివాస్​విమర్శించారు.

Next Story