TG: జీపీవోల ఫలితాల వెల్లడి

by Gantepaka Srikanth |

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రెవెన్యూ పాలనను త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. గ్రామ పాలనాధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను వేగవంతం చేసింది.

TG: జీపీవోల ఫలితాల వెల్లడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రెవెన్యూ పాలనను త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. గ్రామ పాలనాధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను వేగవంతం చేసింది. పూర్వపు వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆసక్తి కలిగిన వారి చేత కాన్సెంట్స్ తీసుకున్నారు. ఆ తర్వాత వారికి లిఖితపూర్వక పరీక్షను నిర్వహించారు. ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష పెట్టారు. కేవలం ఐదు రోజుల్లోనే వారి సమాధాన పత్రాలను వ్యాల్యూయేషన్ చేశారు. శుక్రవారం ఫలితాలను ప్రకటించడం గమనార్హం. ఈ నెల 25న జీపీవో పోస్టుల కోసం పరీక్ష రాసిన 3550 మంది పూర్వపు వీఆర్వో, వీఆర్ఏల ఫలితాలు వెల్లడించారు. https://ccla.telangana.gov.in/Welcome.do వెబ్ సైట్‌లో ర్యాంకులను చూడొచ్చు. రెండు, మూడు రోజుల్లోనే నియామకపు పత్రాలను అందించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి జీపీవోలు రావచ్చునని అంచనా. ఐతే రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులు ఉండగా కేవలం 3550 మంది మాత్రమే పరీక్ష రాశారు. మిగతా పోస్టులను ఏ విధంగా భర్తీ చేయనున్నారో వేచి చూడాలి.

టాప్ ర్యాంకర్లు వీరే

ర్యాంక్ పేరు

1. అద్ద మధు

2. షేర్ లతీఫ్ సాహేబ్

3. బి.ప్రవీణ్ కుమార్

4. విజయ సోమిరెడ్డి

5. ఈదన్న రవీందర్

6. దిడ్డి మౌనిక

7. మణిమాల గ్యాదరీ

8. సూదరి పాల్ ప్రశాంత్ కుమార్

9. మెఘావత్ జగన్

10. పందెన భాస్కర్

11. నల్లోల సంజీవులు

12. పొన్నం రాజు

13. కలకుంట్ల దిలీప్

14. ఏ తేజస్వి కశ్యప్

15. దైదా ప్రశాంత్ రెడ్డి

16. శ్రీకాంత్ రెడ్డి ఈ

17. నళిని పి

18. ఈ శ్రీనివాస్

19. రామిడి మాదవరెడ్డి

20. తూమాటి శైలజ..

Next Story