తెలంగాణ విజిలెన్స్ కొత్త డీజీగా విక్రమ్ సింగ్ మాన్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-29 14:04:31  IST  )

తెలంగాణ విజిలెన్స్ కొత్త డీజీగా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ విజిలెన్స్ కొత్త డీజీగా విక్రమ్ సింగ్ మాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విజిలెన్స్ కొత్త డీజీగా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం డీజీగా విధులు నిర్వహిస్తున్న 1994 బ్యాచ్‌కు అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డి పదవీకాలం ఈనెల 31వ తేదీతో ముగియనుంది. ఆయన పదవీ విరమణతో ఖాళీ అవుతున్న స్థానాన్ని విక్రమ్ సింగ్ మాన్‌తో భర్తీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ కమిషనర్‌గా విక్రమ్ సింగ్ కొనసాగుతున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన అదనపు భాద్యతలలో కొనసాగనున్నారు.

Next Story