- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నియమాలకు నో చెప్పిన అధికారులు.. నోటీసులతో కాలయాపన మాత్రమే.!
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మా ణాలు ఆగడం లేదు. కొందరు జీ ప్లస్ 3 అనుమతులు మాత్రమే తీసుకొని జీ ప్లస్ 4

దిశ, వికారాబాద్ ప్రతినిధి : వికారాబాద్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మా ణాలు ఆగడం లేదు. కొందరు జీ ప్లస్ 3 అనుమతులు మాత్రమే తీసుకొని జీ ప్లస్ 4 నిర్మాణాలు చేపట్టినా మున్సి పల్ అధికారులు పట్టించుకోని ఘటన లు అనేకం. మరికొందరు పట్టణంలో ని ఆలంపల్లి ప్రధాన రోడ్డులో సైతం సెట్ బ్యాక్ వదలకుండా నిర్మాణాలు చేసినా అటుపక్క ఒక్క మున్సిపల్ అ ధికారి చూడకపోగా, కేవలం నోటీసుల తో కాలయాపన చేసి సైలెంట్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే వికారాబాద్ మున్సిపల్ నేడు అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ గా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్రమ నిర్మాణాలు అనేకం..
వికారాబాద్ పట్టణంలోని ప్రధాన ఎన్టీఆర్ చౌరస్తా నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డులో వికారాబాద్ బ్రిడ్జి సమీ పంలో మరో అక్రమ నిర్మాణం కొనసాగుతున్నది. మున్సిపల్ అధికారులు మాత్రం గాఢ నిద్రలో ఉన్నారనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. వంద ఫీట్ల ప్ర ధాన రోడ్డుగా ఉన్న ఈ రోడ్డు మధ్యలో నుంచి 50 ఫీట్లు వదిలి ఆ తరువాత సెట్ బ్యాక్ వదిలిన తర్వాతే నిర్మాణం చేపట్టాల్సి ఉంది. సదరు వ్యక్తి ఆ నిబంధనలు ఏమీ పాటించకుండా నిర్మాణం చేపడుతుండడం విశేషం. ప్రధాన రోడ్డులోనే ఇంత తతంగం జరుగుతు న్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోతే పట్టణం లోపల, కాలనీల్లో ఇంకా ఎన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చని పట్టణ ప్రజలు వాపోతున్నారు. సదురు వ్యక్తికి మున్సిపల్ అధికారులు నోటీ సులు ఇచ్చినా నిర్మాణ పనులు ఆపకపోవడంతో మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక సాధారణ పేద వ్యక్తి మున్సిపల్‌లో ఏదైనా అనుమతిలేని, లేదా అనుమతులకు విరుద్ధంగా నిర్మా ణం చేపడితే జేసీబీ తీసుకెళ్లి మరీ కూ ల్చివేసే మున్సిపల్ అధికారులు సంప న్నుల విషయంలో మాత్రం ఎందుకు రూల్స్ ఫాలో అవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
4 ఈంచులు జరిపాడని కూల్చివేత..
6 నెలల క్రితం వికారాబాద్ పట్టణంలోని ఎంఐజీ కాలనీలో నివాసం ఉం టున్న ఓ పెద్దమనిషి సెట్ బ్యాక్ నిబంధనలకు విరుద్ధంగా కేవలం ఇటుక మందం అనగా నాలుగు ఈంచులు ముందుకొచ్చి కాంపౌండ్ వాల్ ని ర్మించాడు. ఈ విషయమై ఇంటి పక్క వారు ఫిర్యాదు చేయగా, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. కాంపౌండ్ వాల్ కూల్చాల్సిందే అని ఆదేశించారు. దాంతో చేసేదిలేక సదురు వ్యక్తి తన దగ్గర జేసీబీ ఖర్చులు కూడాలేవని చె ప్పడంతో మున్సిపల్ కమిషనర్ ము న్సిపల్ నిధుల నుంచి జేసీబీని తీసు కొచ్చి మరీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కాంపౌండ్ వాల్ ను కూల్చి వేశారు.
అలా నిబద్ధతతో పనిచేసిన అ ధికారులు పట్టణంలోని ప్రధాన రోడ్డు లు ఇన్ని అక్రమాలు జరుగుతుంటే మాత్రం నోటీసులతో ఎందుకు సరిపెడుతున్నారని బాధితులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఇదే కాకుండా గతం లో ఓ స్వీట్ హౌస్ యజమాని సైతం సెట్ బ్యాక్ వదలకుండానే అక్రమ నిర్మాణం చేపట్టినా నోటీసులు మాత్ర మే ఇచ్చిన మున్సిపల్ అధికారులు సై లెంట్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంపన్నులపై ఒకతీరు, పేదలపై ఒకతీరుగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు.
నోటీసు ఇచ్చాం..- జాకీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్
వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రోడ్డులో వికారాబాద్ బ్రిడ్జి సమీపంలో సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా ఒక నిర్మాణం జరుగుతుందని నా దృష్టికి వచ్చింది. వా రికి ఇప్పటికే టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి ఒక నోటీసు జారీ చేశాం. నో టీసులు ఇచ్చిన కూడా నిర్మాణ పను లు కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరు ద్దంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టి నా ఉపేక్షించబోం. సదురు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.






