- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరద బాధితులను ఆదుకునేందుకు సినీపరిశ్రమ ముందుకు రావాలి: విజయశాంతి
ఇటీవల వరదలు సంభవించిన కామారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ...

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల వరదలు సంభవించిన కామారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ... వరదలు కామారెడ్డిని అతలాకుతలం చేశాయని చెప్పారు. కామారెడ్డిలో ఇంత జరుగుతుంటే బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కనిపించలేదని బాధితులు అంటున్నారని ఆరోపించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సినీపరిశ్రమ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అనంతరం అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వరద రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నష్టపరిహారం కోసం నివేదికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కేంద్రాన్ని రూ.10 వేల కోట్ల సాయం అడిగామన్నారు. ఇదిలా ఉంటే కామారెడ్డిలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. వరదల కారణంగా జిల్లాలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. జాతీయ రహదారి సైతం కొట్టుకుపోయింది. కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకోవడంతో ప్రజలు ఎంతో ఇబ్బందిపడ్డారు.






