బీసీ బిడ్డలంటే అడుక్కోవాలా?: విజయశాంతి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-06 15:38:32  IST  )

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న‌ట్టే 42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను సాధించి తీరుతామ‌ని ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి అన్నారు. జంత‌ర్ మంత‌ర్ వద్ద బీసీ రిజ‌ర్వేష‌న్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామ‌ని

బీసీ బిడ్డలంటే అడుక్కోవాలా?: విజయశాంతి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న‌ట్టే 42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను సాధించి తీరుతామ‌ని ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి అన్నారు. జంత‌ర్ మంత‌ర్ వద్ద బీసీ రిజ‌ర్వేష‌న్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామ‌ని, అదే మ‌న ఆరాటం అని వ్యాఖ్యానించారు. ఇలా పోరాటం చేయ‌డం రెండోసారి అని చెప్పారు. భార‌త‌దేశంలోని జ‌నాభాలో అత్య‌ధికంగా ఉన్నది బీసీ బిడ్డ‌లే అని అన్నారు. అలాంటి బీసీ బిడ్డ‌లు న‌డిరోడ్డు మీద‌కు వ‌చ్చి 42 రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌ని కోరుతున్నార‌ని బీజేపీకి సిగ్గుందా అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

బీసీ బిడ్డలు అడుక్కోవాలా.. న్యాయం చేయ‌రా అని ప్ర‌శ్నించారు. మా శ్ర‌మ‌ను దోచుకుంటారు, మా ఓట్లు దోచుకుంటారు కానీ పార్ల‌మెంటులో బీసీ బిల్లును ఆమోదించ‌మంటే వెన‌క‌డుగు వేస్తారా అని మండిప‌డ్డారు. అయినా విడిచిపెట్ట‌మ‌ని కాంగ్రెస్ ముంద‌డుగు వేసింద‌ని విడిచిపెట్టేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ఉద్య‌మంలో అనేక క‌ష్టాలు ఎదుర్కొన్నామ‌ని అయినా రాష్ట్రాన్ని సాధించామ‌ని, బీసీ రిజ‌ర్వేష‌న్లు కూడా అదే విధంగా సాధిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Next Story