- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijaya Dairy : పాడి రైతులకు విజయ డెయిరీ భారీ గుడ్ న్యూస్
తెలంగాణ(Telangana)లోని పాడి రైతుల(Dairy farmers)కు మరో భారీ గుడ్ న్యూస్.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లోని పాడి రైతుల(Dairy farmers)కు మరో భారీ గుడ్ న్యూస్. రాష్ట్రంలోని ప్రభుత్వ డెయిరీ అయిన విజయ డెయిరీ(Vijaya Dairy) పాడి రైతులకు మేలు చేకూరే కీలక నిర్ణయం తీసుకుంది. పాల సేకరణ ధరలు భారీగా పెంచుతున్నట్టు ఓ ప్రకటన జారీ చేసింది. ఇది వరకు గేదె పాలల్లో 7 శాతం వెన్న ఉంటే లీటర్ కు రూ.56 ఇచ్చేవారు. దానిని ఇపుడు లీటర్ కు రూ.59.50కు పెంచింది. అలాగే 10 శాతం వెన్న ఉంటే ఇదివరకు లీటరుకు రూ.80 ఇస్తుండగా.. ఇకపై రూ.84.60 ఇవ్వనుంది. అయితే ఆవు పాల సేకరణ ధరలను మాత్రం స్వల్పంగా తగ్గించింది.
ఇది వరకు 3 శాతం వెన్న కలిగిన లీటరు ఆవుపాలకు రూ.40 ఇస్తుండగా.. దానిని రూ.36.50 కు తగ్గించింది. మొత్తంగా గేదె పాలు విక్రయించే రైతులకు భారీగా లబ్ది చేకూరగా.. ఆవుపాలు విక్రయించే రైతులు స్వల్పంగా నష్టపోనున్నారు. అయితే సవరించిన పాల ధరలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్టు సమాచారం. అయితే పాల సేకరణ ధరలు పెంచడం పట్ల పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






