- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఎంకే వైఫల్యాలపై విజయ్ వార్.. రేవంత్ రెడ్డి బాటలో తమిళనాడు సీఎం!
తెలంగాణలో రేవంత్ రెడ్డి మాదిరిగానే తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై విజయ్ శ్వేతపత్రం నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత విజయ్ తన పని మొదలుపెట్టారు. సీఎంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశి మాట్లాడుతూ రాష్ట్రం పట్ల తన ఆలోచన ఏంటి? భవిష్యత్ ప్రణాళికలు ఏంటో స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు ప్రజలకు వివరించేలా వైట్ పేపర్ రిలీజ్ కు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీని ఫాలో అయ్యారనే చర్చ జరుగుతున్న సమయంలో విజయ్ తీసుకున్న వైట్ పేపర్ డిసిషన్ వెనుక రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇక్కడ టీఆర్ఎస్, అక్కడ డీఎంకే:
తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక వాస్తవ పరిస్థితులను బయటపెట్టారు. 42 పేజీల శ్వేత పత్రాన్ని అసెంబ్లీ ముందు ఉంచి అందులో రాష్ట్ర ఆదాయం, అప్పులు, ఖర్చులు, రుణాలు అన్నింటి లెక్కలను క్లియర్ కట్ గా ప్రజల ముందు ఉంచారు. అంతే కాదు ఈ లెక్కల ఆధారంగా తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ధ్వంసం చేసిందని దుయ్యబట్టారు. ఇప్పుడు ఇదే ట్రెండ్‍ను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది.బాధ్యతలు స్వీకరించిన వెంటనే 2021-2026 మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘శ్వేతపత్రం’ (White Paper) విడుదల చేస్తామని ప్రకటించారు. డీఎంకే ప్రభుత్వం మాకు ₹10 లక్షల కోట్ల అప్పును మిగిల్చింది. గత ప్రభుత్వం రాష్ట్రంపై ఎంత భారం మోపిందో ప్రజలందరికీ తెలియజేస్తాను అని విజయ్ స్పష్టం చేయడంతో గత డీఎంకే ప్రభుత్వంపై విజయ్ యుద్ధం ప్రకటినట్లైందనే చర్చ జరుగుతోంది.
మిత్రపక్షాలు సహకరిస్తాయా?:
పారదర్శక పాలన అందిస్తానని చెప్పిన విజయ్ అంతకంటే ముందు గత ప్రభుత్వం తాలూకా ఆర్థిక వ్యవహారాలపై ఫోకస్ పెట్టడం తమిళ రాజకీయాల్లో చర్చగా మారుతోంది. గతంలో డీఎంకేతో అలయెన్స్ లొ కొనసాగిన పార్టీలే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలిచాయి. ఈ పార్టీల మద్దతు లేకుండా విజయ్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం సాధ్యం అయ్యే పరిస్థితులు లేవు. దీంతో తమ పాత మిత్రుడు డీఎంకే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా విజయ్ శ్వేతపత్రం అంటూ రాజకీయం ప్రారంభిస్తే మిత్రపక్షాలు ఏ మేరకు సహకరిస్తాయనేది వేచి చూడాలి.






