మరోసారి దానం వర్సెస్ విజయారెడ్డి..పార్టీ సభలో రచ్చ రచ్చ

by Ajay Maddhiboyina |

ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో మ‌రోసారి వర్గపోరు బయట పడింది. బంజారాహిల్స్ లేక్ వ్యూలో జరిగిన పార్టీ

మరోసారి దానం వర్సెస్ విజయారెడ్డి..పార్టీ సభలో రచ్చ రచ్చ
X

దిశ, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో మ‌రోసారి వర్గపోరు బయట పడింది. బంజారాహిల్స్ లేక్ వ్యూలో జరిగిన పార్టీ సభలో ఎమ్మోల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోటా పోటీగా ఇరు వర్గాల అనుచరులు నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి అక్కడ నుండి అసంతృప్తితో వెళ్లిపోయారు.

గ‌తంలోనూ వీరిద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో స‌న్న‌పబియ్యం పంపిణీ కార్య‌క్ర‌మంలో విజ‌యారెడ్డి ఫోటోను ప్లెక్సీలో పెట్ట‌క‌పోవ‌డంతో దానంపై ఆమె అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అక్కడే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని విజయారెడ్డిని సముదాయించారు. ఇక మరోసారి వీరిద్దరూ బహిరంగంగా వాగ్వాదానికి దిగడంతో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది.

Next Story