- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంతూరు ప్రజలకు విజయ్ దేవరకొండ పెళ్లి దావత్
విజయ్ దేవరకొండ గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. రష్మిక(Rashmika Mandanna)తో పెళ్లి తర్వాత తొలిసారి స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్ పేటకు సోమవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఊరందరికీ దావత్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్‌లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి గృహ ప్రవేశం చేసి, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఆపై అక్కడికి వచ్చిన వారికి విందు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకుముందు గ్రామస్తులు నూతన వధూవరులకు తెలంగాణ సాంప్రదాయ పద్దతుల్లో డప్పు, వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. పెద్దలు నూతన జంటకు దిష్టి తీసి, ఇంట్లోకి తీసుకెళ్లారు. సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న కూడా తన మూలాలను మర్చిపోకుండా విజయ్ సొంత గ్రామానికి రావడంపై గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయ్, రష్మికతో కలిసి ఫామ్ హౌస్‌లో ఫొటోలు దిగారు. ఇక ఈ నెల 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు ప్రముఖ రాజకీయ నాయకులు, బిగ్ సినీ స్టార్స్ రాబోతున్నారు. వీడియో






