ముగిసిన విజయ్ దేవరకొండ సీఐడీ విచారణ

by Muthe.Rajitha |

సినీ నటుడు విజయ్‌దేవరకొం సీఐడీ సిట్‌ విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది.

ముగిసిన విజయ్ దేవరకొండ సీఐడీ విచారణ
X

దిశ, వెబ్ డెస్క్ : సినీ నటుడు విజయ్‌దేవరకొం సీఐడీ సిట్‌ విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఆన్లైన్ బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో విజయ్‌ దేవరకొండను గంటకుపైగా సిట్‌ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్‌ యాప్‌ల నుంచి తీసుకున్న రెమ్యునరేషన్, కమీషన్లపై ప్రశ్నించినట్టు సమాచారం. విచారణ అనంతరం సీఐడీ కార్యాలయం వెనుకగేటు నుంచి విజయ్‌ దేవరకొండ వెళ్లిపోయారు. కాగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని విజయ్‌ దేవరకొండతో పాటు నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కూడా సీఐడీ సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేయగా.. వారు నేడు సిట్ కార్యాలయంలో హాజరయ్యారు.

Next Story