- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vigilance raids: విజిలెన్స్ ఆకస్మిక దాడులు.. అక్రమార్కులపై లక్షల్లో ఫైన్‌లు
రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు అక్రమార్కులపై విరుచుకు పడుతున్నారు. శుక్రవారం రైస్ మిల్లులపై తనిఖీలు, రూట్ చెకింగ్లు చేపట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా (Vigilance raids) విజిలెన్స్ అధికారులు అక్రమార్కులపై విరుచుకు పడుతున్నారు. శుక్రవారం రైస్ మిల్లులపై తనిఖీలు, రూట్ చెకింగ్లు చేపట్టారు. ఆర్‌సీ పురం యూనిట్ పరిధిలో సిద్దిపేటలో ఎంఎం ఫుడ్ ప్రాసెసింగ్ పారాబాయిల్డ్ రైస్ మిల్‌లో 2024–25కి సంబంధించి 6,674 క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యం దారి మళ్లించినట్లు గుర్తించామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. ధాన్యం విలువ రూ.1.54కోట్లు ఉంటుందని తెలిపారు. సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. నల్గొండ యూనిట్ పరిధిలో సూర్యాపేట్ జిల్లాలో వీఎంఎన్ఆర్ స్టోన్ క్రషర్ కంపెనీలో మైనింగ్ అధికారులతో విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. 3,252 మెట్రిక్ టన్నుల స్టోన్ సీనరేజ్ కట్టలేదని గుర్తించి రూ.2.53 లక్షల సీనరేజీ విధించినట్లు పేర్కోన్నారు.
వాహనాలపై రూ.14.32 లక్షల పెనాల్టీ
ఎంవీఐ, మైన్స్, కమర్షియల్ శాఖ అధికారులతో హైదరాబాద్ యూనిట్ 1 పరిధిలో గురు, శుక్ర వారాల్లో పటాన్ చెరువు, ముతాంగి టోల్ గేట్ ప్రాంతాల్లో రూట్ చెకింగ్ నిర్వహించినట్లు డీజీ పేర్కోన్నారు. ఎంవీఐ యాక్ట్ కింద 10 వాహనాల పై కేసు నమోదు చేసి రూ.5.18 లక్షల పెనాల్టీ విధించినట్లు తెలిపారు. మైనింగ్ యాక్ట్ కింద రెండు వాహనాలపై జీఎస్టీ కింద , రెండు వాహనాలపై కేసులు నమోదు చేసి పెనాల్టీ విధించినట్లు తెలిపారు. మొత్తంగా రూ.7.28 లక్షల పెనాల్టీ విధించినట్లు వెల్లడించారు. ఆర్టీఏ డిపార్ట్మెంట్ అధికారులతో సంయుక్తంగా కరీంనగర్ – పెద్దపల్లి రూట్ చెకింగ్ నిర్వహించి 18 కేసులు నమోదు చేసి రూ.6.50 లక్షల పెనాల్టీ విధించినట్లు తెలిపారు.






