- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్–రంగారెడ్డిలో విజిలెన్స్ దాడులు: 35 వాహనాలపై కేసులు, రూ.12.86 లక్షల టాక్స్ వసూలు
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, మైనింగ్ ఆర్టీఏ, స్టేట్ టాక్స్ డిపార్ట్మెంట్‌లతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహిచినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ శిఖాగోయల్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, మైనింగ్ ఆర్టీఏ, స్టేట్ టాక్స్ డిపార్ట్మెంట్‌లతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహిచినట్లు (Vigilance raids) విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ శిఖా గోయల్ (DG Shikha Goyal) తెలిపారు. రెండు రోజుల పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు ఆమె శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంయుక్తంగా చేపట్టిన దాడులలో 35 వాహనాలపై కేసుల నమోదు చేసి రూ.12.86 లక్షల టాక్స్ విధించినట్లు పేర్కోన్నారు. 9వ తేది మధ్య రాత్రి నుంచి ఆర్‌సీ పురం యూనిట్ ముఠంగి, పటాన్‌చెరు శివారు ప్రాంతాల్లో ఆకస్మిక రూట్ తనిఖీ నిర్వహించి 16 వాహనాల పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. టాక్స్ చెల్లింపు చేయకపోవడం, ఓవర్‌లోడ్, ట్రాన్సిట్ ఫారం లేకుండా రవాణా, రాయల్టీలు, జీఎస్టీ ఎగవేతలకు మోటారు వాహన చట్టం, మైన్స్ చట్టం, జీఎస్టీ చట్టం కింద కేసులు బుక్ చేయబడినట్లు వెల్లడించారు.
రూ.6.70లక్షల మొత్తం టాక్స్ విధించినట్లు తెలిపారు. 10వ తేదిన రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట్ ప్రాంతంలో ఆకస్మిక రూట్ తనిఖీ నిర్వహించి 19 వాహనాలపై మోటారు వాహనాల చట్టం కింద, 15 కేసులను మైన్స్ మినరల్స్ చట్టం కింద బుక్ చేసినట్లు తెలిపారు. రూ.6.16లక్షల టాక్స్ విధించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిధులు, సహజ వనరుల దుర్వినియోగం ప్రభుత్వ ఆదాయ లీకేజీని నిరోధించడానికి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కట్టుబడి ఉంటుందని పేర్కోన్నారు. ప్రభుత్వ నిధులు లేదా వనరుల దుర్వినియోగం లేదా ఏదైనా అవకతవకల గురించి సమాచారాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌తో పంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు డీజీ శిఖా గోయల్ పేర్కోన్నారు.






